అనుదీప్-శివకార్తీకేయన్ మూవీ రిలీజ్ డేట్ లాక్‌డ్

-

‘జాతి రత్నాలు’ చిత్రంతో అందులో లీడ్ రోల్స్ ప్లే చేసిన నటులతో పాటు డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా ఫుల్ ఫేమస్ అయిపోయాడు. టాలీవుడ్ క్రేజీయెస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. ఆయన దర్శకత్వంలో రాబోయే నెక్స్ట్ ఫిల్మ్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదరుచూస్తున్న క్రమంలో తాజాగా మేకర్స్ ఆ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దర్శకుడు అనుదీప్ కేవీ-కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్ కాంబోలో వస్తున్న SK20 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు మేకర్స్. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తుండగా, మ్యూజిక్ ఎస్.ఎస్.థమన్ అందిస్తు్న్నారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతుండగా, ఇప్పటికే సగం కంటే ఎక్కువ షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 31న ఈ ఫిల్మ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news