టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ ను యాడ్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కీర్తి సురేశ్,మ హేశ్ బాబుల పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు.
మాస్ మెలోడీ అయిన ఈ సాంగ్ ను రైట్ టైమ్ లో రిలీజ్ చేయాలని చూశామని, ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైన ఈ పాటను చూడొచ్చని మేకర్స్ తెలిపారు. నిజానికి ఈ పాటను మొదట షూట్ చేసినప్పటికీ..‘‘మ..మ..మహేశా’’ అనే సాంగ్ ను అక్కడ రిప్లేస్ చేశారు. తాజాగా ఈ పాటను చిత్రంలో కలిపేశారు.
మహేశ్ అభిమానులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ సైతం సినిమా విజయం పై ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ నేపథ్యంలో స్టోరిని డిజైన్ చేసిన విధానం, మహేశ్ క్యారెక్టరైజేషన్ జనాలకు బాగా నచ్చుతోంది. మహేశ్, కీర్తి సురేశ్ ల లవ్ ట్రాక్, కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కవుట్ అయింది. మహేశ్ నెక్స్ట్..త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళిలతో సినిమాలు చేయనున్నారు.
The most awaited news is here! 🤩
The MASS Melody #MurariVaa song now attached to #SarkaruVaariPaata on the Big Screens!#BlockbusterSVPSuper🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/cpcRjny4mb
— Mythri Movie Makers (@MythriOfficial) June 1, 2022