సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2వ తేదీన భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. “తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.” అంటూ తెలుగులో ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.
తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు
ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022