గూగుల్ సీఈవో సుందర్‌పిచాయ్‌పై దక్షిణ కొరియాకు చెందిన సిటిజన్స్ యునైటెడ్ ఫర్ కన్జూమర్ సావర్జినిటీ (సీయూసీఎస్)
ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదైంది. దేశీయ యాప్ అభివృద్ధి దారులపై టెక్ జెయింట్ ఇన్-యాప్ బిల్లింగ్
సిస్టమ్ భారీ భారం మోపుతుందని అభియోగంతో.. దక్షిణ కొరియాకు చెందిన సిటిజన్స్ యునైటెడ్ ఫర్ కన్జూమర్ సావర్జినిటీ (సీయూసీఎస్) ఈ కేసు నమోదు చేసింది.
తమ దేశీయ యాప్ డెవలపర్లు.. గూగుల్‌కు భారీగా కమీషన్లు చెల్లించుకోవాల్సి వస్తున్నదని ఆ కేసు సారాంశం. సీఈవో సుందర్‌పిచాయ్.. గూగుల్ దక్షిణ కొరియా సీఈవో నాన్సీ మాముల్, ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు స్కాట్ బౌమాంట్‌లపై కేసు పెట్టారు. దేశ రాజధాని సియోల్‌లో ఈ కేసు నమోదు చేశారు. దేశ టెలికమ్యూనికేషన్స్ బిజినెస్ చట్టాన్ని గూగుల్ ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. గూగుల్ ఇన్-యాప్ పేమెంట్ పాలసీ అమలులోకి వస్తే ఖర్చులు పెరుగుతాయని, వినియోగదారులపై భారం మోపడమేనని ఆవేదన వ్యక్తం చేశారు సీయూసీఎస్ సభ్యుడొకరు. యాప్ స్టోర్ మార్కెట్ షేర్ కింద తమకు వచ్చే ఆదాయంలో 74.6 శాతం గూగుల్‌కు చెల్లించాల్సిందేనని, మరో ఆప్షన్ లేదని పేర్కొన్నారు.