కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్లు దూకుడుగా ట్రేడవుతుండగా.. మరోవైపు బంగారం కూడా మదుపరులకు లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ఇవాళ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,100గా నమోదైంది. ఇక వెండిపై స్వల్పంగా తగ్గింది. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం.. ఇవాళ తగ్గుముఖం పట్టింది.
ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 370 తగ్గి రూ. 52,100గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.350 కి తగ్గి రూ.47,750 వద్ద కొనసాగుతోంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర నేడు కిలోకు రూ.1000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.67,500గా ఉంది.