వన్ మ్యాన్ షో: జగన్ రిపీట్ చేస్తారా?

-

వన్ మ్యాన్ షో…ఏదైనా ఒక విజయం ఒకరి మీద ఆధారపడి వస్తే అది ఖచ్చితంగా వన్ మ్యాన్ షో అవుతుంది…సినిమాల్లో కావొచ్చు, క్రీడల్లో కావొచ్చు..ఈ మాటని ఎక్కువ వింటాం…అయితే గత కొన్నేళ్ళ నుంచి రాజకీయాల్లో కూడా ఈ వన్ మ్యాన్ షో మాట వింటున్నాం…ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో ఈ వన్ మ్యాన్ షో మాట ఎక్కువ వచ్చింది…అప్పటిరకు అధికారంలో ఉన్న టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో జగన్ వన్ మ్యాన్ షో నడిచిందనే చెప్పాలి…కేవలం జగన్ గాలిలోనే టీడీపీ చిత్తుగా ఓడింది..అలాగే వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.

కేవలం జగన్ నే చూసే జనం వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేశారు…అందుకే భారీగా సీట్లు వచ్చాయి. అయితే ఇదంతా 2019 ఎన్నికల్లో జరిగింది…ఇక అక్కడ నుంచి ఏ ఎన్నికలు వచ్చిన వన్ సైడ్ గానే జరుగుతూనే వచ్చాయి. పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్..ఇలా ఏ ఎన్నికలైన వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఇలా వైసీపీ వన్ సైడ్ గా గెలవడానికి కారణం జగన్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.

సరే ఇవన్నీ జరిగిపోయాయి…మరి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జగన్ వన్ మ్యాన్ షో నడుస్తోందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది…ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తుతులని చూస్తుంటే నెక్స్ట్ జగన్ వన్ మ్యాన్ షో నడవడటం అంత ఈజీ కాదనే చెప్పాలి..ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు బలం కూడా పెరుగుతుంది….అటు పవన్ కల్యాణ్ బలం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో జగన్ వన్ మ్యాన్ షో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువ ఊన్నాయి.

కానీ జగన్ ఒక్కడిని ఎదురుకోవడానికి చంద్రబాబు-పవన్ కలవడానికి చూస్తున్నారు…అవసరమైతే బీజేపీని కూడా కలుపుకోవాలని అనుకుంటున్నారు. అంటే జగన్ బలం ఏంటో అర్ధం చేసుకోవచ్చు..ఏదేమైనా జగన్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగనున్నారు…మరి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వన్ మ్యాన్ షో చూడగలుగుతామో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news