ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారు : హరీష్‌ రావు..

-

బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.

Harish Rao inaugurates AI integrated PET/CT scan at Yashoda Hospital

బాయిల కాడ మోటారు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సీఎం కేసీఆర్ బాయికాడ మోటార్లను పెట్టేది లేదని, రైతులకు కష్టం తెచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారన్నారు మంత్రి హరీష్ రావు. ఎఫ్‌సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్న మంత్రి హరీష్ రావు.. బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను కావాలనే కేంద్ర ప్రభుత్వం ఆపివేసింది మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news