కోతి పుండు బ్రహ్మాండమన్నట్లు..సామాన్యులకు వరుస షాక్ లు తగులుతున్నాయి..ఒకవైపు వంట గ్యాస్ ధరలు వింటే జనాలకు గుండెల్లో మంటలు కూడా పెరుగుతున్నాయి.గ్యాస్ కొద్ది రోజులకు ఖాళీ అవుతుంది. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు..సామాన్యులు తమ జీతాల్లో నుంచి ఈఎంఐలు, ఇంటి రెంట్లతో పాటు వంటగది బడ్జెట్‌కు అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని మీరు కొంతవరకు తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*. కూరగాయలను వండేందుకు మూకుడు లేదా గిన్నెను వాడతారు. ఇక ఈ రెండూ హీట్ ఎక్కేందుకు చాలా సమయం తీసుకుంటాయి. అందుకే మీరు కూరగాయలను ఉడికించాలన్నా.. లేదా వండాలన్నా ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించండి..అప్పుడు గ్యాస్ తక్కువ ఖర్చు అవుతుంది.
*. పప్పు, అన్నం వండడానికి ముందు.. కందిపప్పు, బియ్యాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ప్రెజర్ కుక్కర్లో పెడతారు. అయితే ఇకపై మీరు ముందుగా బియ్యాన్ని, కందిపప్పును నీళ్లతో కడిగి.. కాసేపు నానబెట్టిన తర్వాత కుక్కర్లో పెడితే.. అవి త్వరగా ఉడికిపోతాయి. దీనితో మీరు గ్యాస్‌ను మరింత ఆదా అవుతుంది..
*. వంట చేసేటప్పుడు స్టవ్‌పై మీరెప్పుడూ తడి పాత్రలను పెట్టవద్దు. అలా పెట్టినట్లయితే.. ఆ పాత్రల్లో నిల్వ ఉన్న నీరు ఆరేందుకు గ్యాస్ ఎక్కువ వినియోగం అవుతుంది.
*.ఆహారాన్ని వండేటప్పుడు చాలామంది వండుతున్న గిన్నెపై మూతపెట్టరు. అలా చేయడం వల్ల గ్యాస్, సమయం రెండూ ఎక్కువగా ఖర్చవుతాయి. అందువల్ల మీరు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ప్రతీసారి.. వండుతున్న పాత్రపై దానికి సరిపడా మూత పెట్టండి. అప్పుడు ఫుడ్ తొందరగా కుక్ అవుతుంది తద్వారా గ్యాస్ కూడా భారీగా ఆదా అవుతుంది..ఇవన్నీ గుర్తుంచుకొని వంట చేస్తే మాత్రం రెండు లాభాలు ఉన్నాయి..తక్కువ గ్యాస్ తో ఎక్కువ వంటలు చేసువచ్చు..మీరు ఒకసారి ప్రయత్నించండి…