గౌరవెల్లి నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త !

-

గౌరవెళ్లి నిర్వాసితులు వాళ్ల ట్రాప్ లో పడొద్దని..ఎన్నిసార్లు అయినా మీతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవెళ్లి రిజర్వాయర్ సంఘటన పై సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మంత్రి హరీష్ రావు.

హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దు అనే లక్ష్యంగా ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని… కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ లబ్దికి ప్రయత్నం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయం పనులు అడ్డుకుని, పోలీసులపై తెరగపడేలా చేసి తప్పుకున్నారు…ప్రజలు, రైతులు బాగు పడటం ఇష్టం లేక అడ్డుకునే యత్నాలని విమర్శలు చేశారు. కేసీఆర్ లక్ష్యంతో లక్షలాది ఎకరాల్లో కోట్లాది క్విఎంటళ్ల పంట పండింది.. నీళ్లు తెస్తుంటే రైతుల కళ్ళలో ఆనంద బాష్పయాలు వస్తుంటే, ప్రతిపక్షాల్లో కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.

ఇరిగేషన్ అధికారులు పనులు చేసుకుంటే వరుసగా దాడులు చేస్తూ పనులు అడ్డుకున్నారు. పరియాకరలు పగుల గొట్టారు…పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే భద్రత కల్పించారన్నారు మంత్రి హరీష్ రావు. 693 ఇండ్లు ఉన్నాయి.. 2015లో 683 ఇండ్లకు 83 కోట్లు చెల్లించాము. 98.58 శాతం పేమెంట్ చేశాం.. ఇంకా 1.45 మాత్రమే చెల్లించాలి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news