ఓ దుర్మార్గుడు తన ఫ్రెండ్ భార్య పైనే కన్నేసాడు. మీతో ఉండి పని చేసుకుంటానని చెప్పి ఇంట్లోకి చేరిన సదరు వ్యక్తి.. స్నేహితుడి భార్య స్నానం చేస్తుండగా నగ్నంగా వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. అంతేకాకుండా.. బ్లాక్‌మెయిట్ చేస్తూ బలవంగా ఆమెపై కోరిక తీర్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న దంపతులు పొట్టకూటి కోసం సిటీకి చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న పతులు సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో భర్త స్నేహితుడు వాళ్ల ఇంటికి వెళ్లాడు. నేను ఇక్కడే ఉంటానని, ఇంటి అద్దె. ఇంటి ఖర్చుల్లో సగం డబ్బులు నేను ఇస్తానని, ఇక్కడే పని చేసుకుంటూ మీతోనే ఉంటానని భర్తకు చెప్పాడు. స్నేహితుడే కదా అంటూ భర్త సరే అన్నాడు. స్నేహితులు ఇద్దరూ ప్రతిరోజు పనికి వెళ్లి వస్తున్నారు.
ఇటీవల భర్త పనికి బయలుదేరడంతో తనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన అతని స్నేహితుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న కేటుగాడు ఫ్రెండ్ భార్య స్నానం చేస్తుంటే మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. నేను చెప్పినట్లు వినాలని, నాకు పడక సుఖం ఇవ్వాలని, లేదంటే నీ భర్తకు నీ నగ్న వీడియోలు చూపిస్తానని టార్చర్ పెట్టాడు. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. భర్త ఫ్రెండ్ టార్చర్ తట్టుకోలేని భార్య జరిగిన విషయం మొత్తం భర్తకు, పోలీసులకు వివరించింది. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తి అరెస్ట్ చేశారు.