కోడిగుడ్డు పొట్టుతో లక్షలు సంపాదిస్తున్న మహిళలు..ఎక్కడో తెలుసా?

-

కోడిగుడ్డు వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఈ గుడ్డును రోజు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..ఇకపోతే గుడ్డు తీసిన తర్వాత ఎందుకు పనికి రాదని పడేస్తున్న గుడ్డు పొట్టును ఉపయోగించి కొందరు మహిళలు లక్షలు సంపాదిస్తున్నారు.. అసలు ఏం చేస్తున్నారు.. వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

 

ఆ కోడి గుడ్డు పొట్టునిమొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే ఛత్తీస్ గడ్ లోని మహిళలు మరికొంచెం ముందుకు వెళ్లి.. వెరైటీగా ఆలోచించారు. ఇప్పుడు ఈ కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం చేస్తున్నారు..అంబికా మునిసిపల్ కార్పొరేషన్ సహాయంతో.. ఈ గుడ్ల పెంకులను ద్వారా ఆదాయం పొందుతున్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు..జిల్లా కలెక్టర్ రీతూ సేన్ జిల్లాలోని మహిళా సాధికారత అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సహాయంతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. క్యాంటీన్ మేనేజ్మెంట్, పార్కింగ్, అటెండన్స్ , నగరంలో చెత్త మేనేజ్మెంట్ వివిధ కారిక్రమాలతో మహిళలకు పని చూపించేవారు…

ఈ నేపథ్యంలో కోడిగుడ్డు పొట్టుతో కాల్షియం పౌడర్ తో పాటు మొక్కలకు ఎరువులను తయారు చేయడం పై అవగాహన కల్పించారు..

కాల్షియం పౌడర్ తయారి..

ముందుగా గుడ్డు పెంకులను నీటితో కడిగి, ఎండలో ఎండబెడతారు. అనంతరం ఆ గుడ్డు పెంకులను మెత్తగా దంచుతారు. అనంతరం ఆ పొడిని జల్లెడ పట్టి ఫిల్టర్ చేస్తారు. ఈ గుడ్డు పెంకు ఒక కిలోగ్రాము పొడిని ఒక క్వింటాల్ కోళ్ల దాణాకు కలుపుతారు. ఇది విత్తనాలలో కాల్షియంను తిరిగి నింపుతుంది..పశుసంవర్థక శాఖ కూడా వారికి పూర్తి సాయం చేస్తోంది. దీంతో కోడి గుడ్డు పెంకులు చెత్తలోకి వ్యర్ధాలుగా వెళ్లకుండారీసైక్లింగ్ అవుతుంది. ఓ వైపు మహిళలకు ఆదాయాన్ని ఇస్తుంది. మరోవైపు కోళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుందని అన్నారు.పూలు, పండ్లు, కూరగాయల పంటలకు మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది..

కోడి గుడ్డు పౌడర్, కోడి గుడ్డు ఎరువులు రెండు కిలోలు రూ.200 నుంచి రూ.600 వరకు పలుకుతున్నాయి. ఇక్కడ మహిళ గ్రూపులు నెలకు 50 నుండి 60 కిలోల కోడి గుడ్డు పౌడర్ ని తయారు చేస్తున్నారు..నెలకు 12000 నుంచి 36000 వరకూ అదాయాన్ని పొందుతున్నారు..ఆలోచన, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఆ మహిళలు నిరూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news