హోటళ్లకు షాక్‌.. ప్రజలు రాక్‌.. ఇక నుంచి సర్వీస్‌ చార్జీ నో

-

కుటుంబంతో కలిసి లేకుంటే ఫ్రెండ్స్‌తో కలిసైనా రెస్టారెంట్‌కో లేక హోటల్‌కో వెళితే.. అసలుతో పాటు సర్వ్‌ చేసిన సర్వీస్‌ చార్జీలు కూడా వసూలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం సర్వీస్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సోమ‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాకుండా ఇక‌పై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ స‌ర్వీస్ చార్జీల‌ను వ‌సూలు చేయ‌రాదంటూ క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఏ బిల్లుకు అయినా జీఎస్టీ ప‌న్ను వ‌సూలు చేస్తున్న నేప‌థ్యంలో స‌ర్వీస్ చార్జీ అనే మాటే ఉత్ప‌న్నం కావొద్ద‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

Service charge not mandatory; govt issues guidelines - PTC News

వ‌స్తువులు, సేవ‌ల‌పై జీఎస్టీ పేరిట ప‌న్ను వేస్తున్న‌ప్పుడు ఇక హోట‌ళ్లు, రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీల పేరిట అద‌న‌పు ప‌న్ను వేస్తున్న వైనంపై దృష్టి సారించిన కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు స‌ర్వీస్ చార్జీలు వ‌సూలు చేయ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పుడైనా హోటల్‌కు వెళితే.. సర్వీస్‌ చార్జీలు కట్టకండి.. అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news