ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ శాఖలు.. స్మృతి ఇరానీకి..

-

నిన్న కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ బుధ‌వారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స‌భ్య‌త్వం గురువారంతో ముగియ‌నున్న నేప‌థ్యంలోనే రాజీనామా చేశారు. అంతేకాకుండా ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని బీజేపీ బ‌రిలోకి దించుతున్న నేప‌థ్యంలోనే ఆయ‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి.

Smriti Irani assures Telangana of more 'One Stop Centres' - The Week

అయితే.. ఇక, ఇప్పటివరకు నఖ్వీ నిర్వహించిన కేంద్ర మైనారిటీ వ్యవ‌హారాల శాఖను మ‌రో మంత్రి స్మృతి ఇరానీకి కేటాయిస్తూ మోదీ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో గ‌త కొంత కాలంగా ప్ర‌ధాని వ‌ద్దే ఉన్న కేంద్ర ఉక్కు శాఖ‌ను పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న జ్యోతిరాధిత్య సింథియాకు అద‌నంగా కేటాయించారు మోడీ.

 

Read more RELATED
Recommended to you

Latest news