రాజకీయాల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు…రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..కాకపోతే ప్రజల మనసులు ఏముందో ఎవరు కనిపెట్టలేరు..వారు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పలేం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయిన ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయాలి..అప్పుడే పార్టీలకు విజయం దక్కుతుంది. కానీ రాజకీయాల్లో అతిగా ఊహించుకుంటే దెబ్బపడిపోతుంది.
ముందే ప్రజా మద్ధతు తమకే ఉందని భ్రమల్లో ఉంటే రాజకీయంగా ఎదురుదెబ్బలే తగులుతాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే…మరొకసారి అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్, ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, తొలిసారి అధికారంలోకి రావాలని బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే తెలంగాణ ప్రజల మద్ధతు తమకు ఉందంటే తమకు ఉందని మూడు పార్టీల నేతలు మాట్లాడుతున్నారు…తమకు అధికారం వస్తుదంటే..తమకు వస్తుందని వాదించుకుంటున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రజలు పూర్తిగా ఎవరి పక్షాన ఉన్నట్లు కనిపించడం లేదు. వారు ఎవరి వైపు ఉన్నారో క్లారిటీ లేదు. కానీ తమ వైపు ఉన్నారంటే తమ వైపు ఉన్నారని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి.
ఇదే క్రమంలో వచ్చే ఏడాది జూలైలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. సరిగ్గా 365 రోజుల తర్వాత సోనియాగాంధీ సూచించిన వ్యక్తిని పల్లకిలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూ ర్చోబెడతామని, తన లక్కీ నెంబర్ 9 అని, అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని రేవంత్ అన్నారు.
అయితే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో చెప్పలేం…అంతకంటే ప్రజల ఎవరి వైపు ఉన్నారో తెలియదు..99 సీట్లు ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు తప్పు లేదు…కానీ ఉన్నవే 119 సీట్లు అందులో 99 సీట్లు అనేది అత్యాశే అవుతుంది. కాబట్టి రేవంత్ కలలు నిజమయ్యే అవకాశాలు ఏ మాత్రం కనబడటం లేదని చెప్పొచ్చు.