కేజీ టూ పీజీ, ఉచిత ఆంగ్ల విద్యకు అతీగతీ లేదు : ఎంపీ ఉత్తమ్‌

-

మరోసారి టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య కు అతీగతీ లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వ్యవస్థ ను కూడా కాపాడలేకపోయాడని మండిపడ్డారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. 12 లక్షల మంది విద్యార్థులకు 3,270 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. 2020 – 22 సంవత్సర కాలం ఫీజు రీఏంబర్స్ మెంట్ ఇంత వరకు విడుదల చేయలేదన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. 3600 విద్యాసంస్థలు దెబ్బతింటున్నాయన్నారు. 2014 తరువాత 850 జూనియర్, 350 డిగ్రీ ,150 పీజీ , వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయని, ఫీజు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Uttam Kumar Reddy resigns as chief of Telangana Congress- The New Indian  Express

కాంగ్రెస్ ప్రభుత్వం లో అడగకుండానే 100 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసామని, ఉన్నత విద్య కి నిధులు కేటాయించడం లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 50 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. మన ఊరు మన బడి కోసం ఫిబ్రవరి 3 న ప్రకటించారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసారని, 3497 కోట్లు ఖర్చు చేస్తామని ఇంత వరకు నిధులు విడుదల చేయలేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బీఈడీ కాలేజీ లో 166 టీచర్ లకు 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీఈవో పోస్టులు 33 జిల్లాలకు 10 మంది ఉన్నారన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news