వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు టోక్యో ఆతిథ్యం

-

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2025 పోటీలకు టోక్యో వేదిక కానుంది. ఈ విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ (డబ్ల్యూఏసీ) వెల్లడించింది. అయితే పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు నైరోబీ (కెన్యా), సిలేసియా (పోలండ్), సింగపూర్, టోక్యో నగరాలు నివేదికలు సమర్పించారు. ఇప్పటికే నిర్వహణ సామర్థ్యంలో ఎక్కువ స్కోరింగ్‌ ఉన్న టోక్యోకే వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ ఛాన్స్ ఇచ్చింది. అయితే కరోనా పీరియడ్‌లో 2020లో టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించింది.

టోక్యో ఒలింపిక్స్
టోక్యో ఒలింపిక్స్

అయితే 2020 టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌ అప్పుడు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించలేదు. ప్రేక్షకులు లేకుండానే ఆటలను నిర్వహించింది. కానీ 2025లో ప్రేక్షకుల నడుమ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 2024లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌ పోటీలకు క్రొయేషియాలోని మెడ్యలిన్, ప్యులా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే 2026లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీలను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news