మరోసారి బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. దుండిగల్ పరిధిలోని బహదూర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఉర్దూ ఒక మతం భాష కాదు.. మీ తాతలు, మా తాతలు అందరూ ఉర్దూ భాష నేర్చుకున్నారని, ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారన్నారు మంత్రి కేటీఆర్. ఉర్దూనే అనర్గళంగా మాట్లాడేవారు. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు. కాకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి.. కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఇక్కడ ఉర్దూ మీడియం కాలేజీని మంజూరు చేయిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఉర్దూ అంటే ఒక మతం భాష అని కొందరు మూర్ఖులు పిచ్చిగా మాట్లాడుతున్నారు.
ఒక మతం భాషగా చిత్రీకరించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఒక వైపు ప్రధాని మోదీ ఉర్దూను ప్రమోట్ చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇక్కడున్న వారేమో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ.. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరిస్తున్నారు. కొందరు సన్నాసులు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. భాషను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాల్సిందేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా, కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు.. ఉర్దూ మీడియంలో కూడా కళాశాలను మంజూరు చేయిస్తాం. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు భాష వ్యత్యాసాలు తెలియవు. అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలనే విషయం మాత్రమే తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.