తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థులకు శుభవార్త.. గడువు పొడిగింపు..

-

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే.. రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు ఇటీవల అవకాశం కల్పిస్తూ.. ఈ నెల 19 నుంచి 21 వరకు గడువు పెంచింది. అయితే గడువు గురువారంతో గడువు ముగియగా.. తాజాగా పొడిగించింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

TSPSC Group 1 Notification 2022 Apply Online for 503 Vacancies

ఈ నెల 28 సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్పీ పేర్కొంది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news