భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో తేలిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. పార్లమెంటు భవనంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభం అవగా.. కొద్ది సేపటి క్రితమే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగింసింది. అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీ గెలిచి విజయ దుందుభి మోగించారు.
పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.