తెలంగాణలో ఇంకా మంకీపాక్స్ నిర్దారణ కాలేదు – హరీష్‌ రావు

-

తెలంగాణలో ఇంకా మంకీపాక్స్ నిర్దారణ కాలేదని ప్రకటన చేశారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్‌ కలకలం రేపడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల పై ముందు జాగ్రత చర్యగా జిల్లా కలెక్టర్లు, అధికారు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని గుర్తించామని.. ఇంకా వ్యాధి నిర్దారణ కాలేదని పేర్కొన్నారు. ముందుగానే జాగ్రత్త గా తీసుకున్నామని.. ఫీవర్ హాస్పిటల్ ను నోడల్ హాస్పిటల్ గా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ హాస్పిటల్ లో టెస్టింగ్ ఏర్పాట్లు చేశామని.. కేంద్ర ప్రభుత్వం శాంపిల్ పూణే కు పంపించాలని చెప్పింది… పంపించామని వెల్లడించారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండన్నారు హరీష్‌ రావు. ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లి ఇళ్లను క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టాలని.. ఇంటి అవరణను శుబ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి శుక్రవారం అన్ని సంస్థల్లో, కార్యాలయాల్లో డ్రై డే చేపట్టాలని.. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ అయిన కేసులు నమోదు అయితే మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news