రేపు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..

-

ఏపీ సీఎం జ‌గ‌న్ రేపు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌రిశీల‌న‌, వ‌ర‌ద బాధితుల ప‌రామ‌ర్శ‌కు వెళ్లనున్నట్లు సీఎంవో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మేర‌కు జ‌గ‌న్ కోన‌సీమ జిల్లా మీదుగా ప్రారంభం కానున్న మంగ‌ళ‌వారం నాటి పర్య‌ట‌న‌కు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడికి జ‌గ‌న్ చేరుకుంటారు. అక్క‌డికి స‌మీపంలోని పుచ్చ‌కాల‌య‌వారిపేట‌లో వ‌ర‌ద బాధితుల‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు. అనంత‌రం అలిగేవారిపేటకు చెందిన వ‌ర‌ద బాధితుల‌తో మాట్లాడ‌నున్నారు సీఎం జగన్‌.

Film fraternity to call on CM Jagan Mohan Reddy today, to discuss concerns  about industry- The New Indian Express

ఆ త‌ర్వాత ఊడిమూడిలంక‌లో వ‌ర‌ద బాధ‌దితుల‌తో స‌మావేశం అవుతారు సీఎం జగన్‌. అదే మండ‌ల ప‌రిధిలోని వాడ్రేవుప‌ల్లికి మ‌ధ్యాహ్నం 2.05 గంట‌ల‌కు చేరుకుంటారు సీఎం జగన్‌. అక్క‌డి నుంచి రాజోలు మండ‌లం మేక‌ల‌పాలెం వెళ్లి.. ఆ త‌ర్వాత సాయంత్రం 4.05 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంకు సీఎం జగన్‌ చేరుకుంటారు. రాజ‌మ‌హేంద్రవ‌రం గెస్ట్ హౌస్‌లో వ‌ర‌ద‌ల‌పై అధికారుల‌తో సీఎం జగన్‌ స‌మీక్షిస్తారు. ఈ స‌మీక్ష అనంత‌రం మంగ‌ళ‌వారం రాత్రి జ‌గ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనే బ‌స చేసి.. బుధవారం కూడా జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news