టీఆర్ఎస్లో చేరిన మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే… మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మంత్రి పదవి దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతోపాటు తమ పార్టీ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం అందించగా.. ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఈ ప్రక్రియ పూర్తయిందని చెప్పి ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ఘటనతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ ఎవరికి మంత్రి పదవి ఇస్తారోనని జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే టీఆర్ఎస్లో చేరిన మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే… మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మంత్రి పదవి దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. చేవెళ్లలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపుకు సబితా ఇంద్రారెడ్డి కృషి చేశారు. అలాగే ఆమె తెరాసలో చేరినప్పుడే ఆమెకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారట. దీనికి తోడు కేసీఆర్ కూడా పలు సార్లు తన కేబినెట్లో మహిళలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. దీంతో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా.. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. కేవలం ఒకరిద్దరికి మంత్రులుగా చాన్స్ ఇచ్చారు. ఆ తరువాత ఇప్పుడు దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికలు ముగియడం, తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా పూర్తి కానుండడంతో ఇక కేసీఆర్ రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే అతి త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపడుతారని కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఆయన సబితకు మంత్రి పదవి ఇస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. మరి త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ మంత్రులుగా ఎవరెవరికి చాన్స్ ఇస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!