నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు సోనియాగాంధీ. సోనియా గాంధీ తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. మరోవైపు సోనియాగాంధీని ఈడి ప్రశ్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ధరల పెరుగుదల, జీఎస్టీ పై ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద ఆయన రోడ్డుపై బైఠాయించగా పోలీసులు రాహుల్ గాంధీని అరెస్టు చేశారు.
కాగా రాహుల్ గాంధీ ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. తన అరెస్టు పట్ల రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగంపై ప్రజల తరపున గళం వినిపిస్తున్నానని అన్నారు. మోడీ ఓ రాజులా వ్యవహరిస్తున్నారని, దేశంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. కాగా రాహుల్ గాంధీతో సహా అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ విడుదలయ్యారు. రాహుల్ గాంధీని విడుదల చేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.