బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి అలర్ట్..ఈ టిప్స్ పాటిస్తే జాబ్ గ్యారెంటీ..

-

బ్యాంక్ జాబ్ చెయ్యాలన్నా కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.అయితే ప్రిపరేషన్ లో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల జాబ్స్ రావు. జాబ్ ప్రిపరేషన్ లో కాస్త టైం తీసుకుంటే జాబ్ గ్యారెంటీ అంటున్నారు నిపుణులు.. అందుకోసం కొన్ని టిప్స్ ను కూడా అందించారు.అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

మనం నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్ నే బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. టెన్సెస్, పార్ట్స్ అఫ్ స్పీచ్, కంప్రెసివ్ టెస్ట్ కావచ్చు ఏదైనా అదే సిలబస్ ఉంటుంది. antonyms, synonyms ను ఐదు మార్కులకు ఇవ్వడం ఖాయం. కొంచం చొరవ చూపకపోతే ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించడం కష్టం అవుతుంది. ఇలానే చాలా మంది సెక్షనల్ కట్ అఫ్ రీచ్ అవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా శ్రద్ధ పెట్టి చదివితే కచ్చితంగా ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించడం ముఖ్యం. vocabulary బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉటుంది. ఎర్రర్స్ సంబంధించిన రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ కు సంభందించి 120 రూల్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా నేర్చుకోవాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి గ్రామర్, రెండవది ఒకబిలరీ, మూడవది రీడింగ్, నాల్గవదీ లాజిక్. ఈ నాలుగు విభాగాలను ఇంగ్లీష్ లో ఫోకస్ చేయడం ద్వారా బ్యాంక్ పరీక్షలు ఏవైనా మంచి మార్కులు మీ సొంతం..

vocabulary చాల ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్టి కొట్టే మెథడ్ కి వెళ్ళే తప్పు చేసినట్లే అవుతుంది. చదువుకోవడం ద్వారా కొత్త కొత్త పదాలు అందుబాటులోకి వస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతూ ఉంటారు. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అడుగుతున్నారు. కొత్తగా వార్డ్ రీప్లేస్ మెంట్ అడుగుతున్నారు. మరియు మ్యాచ్ ది కాలమ్స్ అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో చేర్చడం జరిగింది. చాలా మంది vocabulary బిట్స్ చేయలెక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..

పార్ట్స్ అఫ్ స్పీచ్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టడ్ స్పీచ్, ఆర్టికల్స్ తదితర టాపిక్స్ ను బాగా నేర్చుకోవాలి. ఇంగ్లిష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా vocabulary తో పాటుగా రీడింగ్ కాన్సెప్ట్ ఫుల్ ఫిల్ చేయగలరు. రోజుకి రెండు గంటల సమయం న్యూస్ పేపర్ చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్, న్యూ వర్డ్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. డిక్షనరీ ద్వారా అర్థాలు వాటి తెలుసుకొని సాధన చేయాలి. లాజిక్స్ లో ముఖ్యంగా పారాగ్రాఫ్ జంబుల్ అడుగుతున్నారు. పేరాగ్రాఫ్ ను జుంబుల్ చేసి ఇస్తారు. వాటిని మనం అర్థం వచ్చే పేరాగ్రాఫ్ లా మార్చాలి..అంతే ఇలా ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ పక్కా..

Read more RELATED
Recommended to you

Latest news