చిరుతకే చుక్కలు చూపించిన ఊర కుక్క!

-

రాజస్థాన్ లోని జలానా ఫారెస్ట్ రిజర్వ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. సాధారణంగా అడవికి రాజుగా పులిని చెప్పుకుంటుంటారు. మరి.. అటువంటి పులిని ఓ ఊర కుక్క పరిగెత్తిస్తే ఎలా ఉంటది. అబ్బ.. సూపర్.. ఇది కదా కిక్ అంటే అంటారా? పదండి.. ఫారెస్ట్ కు వెళ్దాం.

ఆ ఫారెస్ట్ లో తన పాపాన తను నిద్రపోతున్నది ఓ కుక్క. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కాని ఓ చిరుత పులి ఆకుక్కపై పంజా విసరబోయింది. దెబ్బకు తేరుకున్న ఆ కుక్క అంతే వేగంతో చిరుతపై విరుచుకుపడింది. దీంతో ఆ వీధి కుక్క పౌరుషానికి చిరుత తుస్సుమన్నది. తోక ముడిచి వెనక్కి తగ్గింది. మొత్తానికి ఆ చిరుతకు చుక్కలు చూపించింది కుక్క. ఈ ఘటనను పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news