తెలంగాణ ప్రజలకు డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి.. ఆ పుకార్లను నమ్మకండి..!

-

ప్రజల్లో భయాందోళన సృష్టించే విధంగా ఎవరైనా ఇటువంటి పుకార్లను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయొద్దని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అటువంటి పుకార్లను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా.. మహిళలు, పిల్లలు, పెద్దలు తప్పిపోతున్నారంటూ లేదా అపహరణకు గురవుతున్నారంటూ అసత్యం ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోంది కదా.. దానిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. అటువంటి పుకార్లు నమ్మొద్దంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పైన తెలిపిన మిస్సింగ్ కేసుల్లో చాలా వరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిల్ అవడం, వివిధ కారణాల వల్ల కుటుంబాలను విడిచిపెట్టి వెళ్లిన మహిళలు, పురుషులు, తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోయిన పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని తల్లిదండ్రులు లాంటి కారణాల వల్ల మాత్రమే జరిగినవని డీజీపీ స్పష్టం చేశారు.

అటువంటి కేసుల్లో ఇప్పటికే 85 శాతానికి పైగా ట్రేస్ చేయడమే కాకుండా మిగిలిన కేసులను కూడా ట్రేస్ చేసేందుకు తెలంగాణ పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని డీజీపీ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని.. వాళ్లు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.

ప్రజల్లో భయాందోళన సృష్టించే విధంగా ఎవరైనా ఇటువంటి పుకార్లను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయొద్దని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అటువంటి పుకార్లను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

దీనిపై హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో రూమర్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news