రామారావు ఆన్ డ్యూటీ సినిమా వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

-

హీరో రవితేజకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే మొదట సైడ్ క్యారెక్టర్ గా నటించి ఆ తర్వాత హీరోగా అలా ఎన్నో సినిమాలలో నటించారు రవితేజ.హీరో రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో వరుస పెట్టి అవకాశాలు వెలుపడ్డాయి రవితేజకు. అయితే తన తదుపరి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కావడం జరుగుతున్నాయి. తాజాగా శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ హీరో హీరోయిన్లు తెరకెక్కిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం గత నెల 29వ తేదీ ప్రేక్షకులకు ముందుకు వచ్చినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇకపోతే ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ అధికారిగా కనిపించారు. ఈ క్రమంలోనే అవినీతిపరులైన రాజకీయ నాయకుల భరతం పట్టే అధికారి గా రామారావు పాత్రలో రవితేజ నటించారు.. ఇక ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కావడంతో అభిమానుల సైతం చాలా నిరుత్సాహ చెందారు. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే .. రూ.17.72 కోట్ల రూపాయలు జరిగింది. ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా 18 కోట్ల రూపాయలను రాబట్టాలి.Ramarao on Duty Review: Is It A Lackluster Or Action-Thriller Film?ఇక కేవలం ఈ సినిమా రూ.5.19 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమాకి దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం ఎదుర్కొన్నదని సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటి హక్కులను కూడా ప్రముఖ సంస్థ అయిన సోనీ లైవ్ దక్కించుకుంది. ఈ సినిమాని థియేటర్లో పూర్తి అయిన 8 వారాల తర్వాత విడుదల చేయబోతున్నట్లు తెలుస్తున్నది. మరి ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా ఉన్నప్పటికీ.. మరి ఓటీటి లోనైనా అలరిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news