Breaking : ఈ రోజు అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం

-

రాష్ట్ర ప్రజలకు హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) శుభవార్త తెలిపింది. స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగాహెచ్ఎండీఏ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 15వ తేదీన హైద‌రాబాద్‌లోని అన్ని హెచ్ఎండీఏ పార్కుల్లో ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవ‌య్య పార్క్, లేక్ వ్యూ పార్క్, మెల్కొటే పార్క్, ప్రియ‌ద‌ర్శిని పార్క్, రాజీవ్ గాంధీ పార్క్, పటేల్‌కుంట పార్క్, లంగ‌ర్‌హౌస్ పార్కులో ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే సందర్శకులను లోపలికి అనుమతించనున్నారు.

11 Famous Parks in Hyderabad | Parks in Hyderabad for Family | Treebo Blogs

దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటలకు గోల్కొండలో సీఎం కేసీఆర్‌ పతకావిష్కరణ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news