ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లే అమ్మాయిలు.. ఇవి వెంట ఉండేలా చూస్కోండి..!

-

ఈ జనరేషన్ అమ్మాయిలు వీకెండ్ వచ్చిందంటే ఇంటికే పరిమితం కావడం లేదు. ట్రెక్కింగ్, హైకింగ్, పిక్ నిక్ అంటూ శుక్రవారం రాగానే లగేజ్ ప్యాక్ చేసుకుని వీకెండ్ విహారయాత్రకు బయల్దేరుతున్నారు. వారంలో వచ్చేదే రెండు రోజుల సెలవులు.. ఆ రెండ్రోజులైనా సేద తీరుదామని కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కొండలు, గుట్టలు, పర్వతాలు ఎక్కేస్తున్నారు. చాలా మంది ఒంటరిగా ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ట్రెక్కింగ్ కు వెళ్లే ప్రాంతాల్లో నివాసాలు, దుకాణాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా కావాలంటే వెంటనే దొరకవు. అందుకే ఒంటరిగా ట్రెక్కింగ్ కు వెళ్లేటప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు మీ వెంట ఉండేలా చూసుకోండి. మరి ఆ వస్తువులేంటో ఓ లుక్కేయండి…

మహిళలు ప్రయాణాల్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య పిరియడ్స్‌. ఆ సమయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌, టాంపూన్స్‌, మెన్స్ట్రువల్‌ కప్స్‌ వంటివి లేకపోతే పలు సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ట్రెక్కింగ్‌ వంటి సాహస యాత్రలకు వెళ్లేటప్పుడు వీటిని తప్పకుండా తీసుకెళ్లాలి. వీటితో పాటు టాయిలెట్‌ వైప్స్‌ను కూడా తీసుకెళ్లడం మంచిది. పరిశుభ్రమైన నీరు లభించనప్పుడు ఇవి ఉపయోగపడతాయి.

పవర్‌ బ్యాంక్.. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి. అయితే ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ఛార్జింగ్‌ సదుపాయం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీ బ్యాగులో ఓ పవర్‌ బ్యాంక్ ఉంచుకోవడం ఉత్తమం. దీనిద్వారా అవసరమైనప్పుడు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. అయితే పవర్ బ్యాంక్‌ సామర్థ్యం కొంచెం ఎక్కువగా ఉన్నది తీసుకెళ్లడం మంచిది.

నగదు ఉండాల్సిందే.. ఇప్పుడు చాలామంది ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. దానికి తగ్గట్టే కిరాణాషాపుల దగ్గర్నుంచి తోపుడు బండ్ల దాకా డిజిటల్‌ పేమెంట్స్‌ ఉపయోగిస్తున్నారు. దాంతో చాలామంది నగదుకు బదులు కార్డులు, పేమెంట్‌ యాప్స్‌ మీద ఆధారపడుతున్నారు. అయితే కొండప్రాంతాల్లో ఇలాంటి సౌలభ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏటిఎమ్‌లు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. కాబట్టి, ట్రెక్కింగ్‌కి వెళ్తున్నప్పుడు మీ వెంట కొంత నగదును తీసుకెళ్లడం మంచిది. వాటిని 10, 20, 50 నోట్ల రూపంలో తీసుకెళ్లడం మరీ మంచిది.

మందులు కూడా.. కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండవు. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు గాలులు వీస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తుంటాయి. ఫలితంగా జ్వరం, దగ్గు, జలుబు.. వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన ట్యాబ్లెట్లను తీసుకెళ్లడం మంచిది. అలాగే ఒక పోర్టబుల్‌ గొడుగు కూడా తీసుకెళ్లాలి. ఇది వర్షం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news