నాకు ప్రపంచ కప్ ఆడాలని ఉంది.. కానీ: శిఖర్ ధావన్ భావోద్వేగ వీడియో

-

తన గాయం కారణంగా ధావన్ ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ జరిగనప్పుడు.. కమిన్స్ బౌలింగ్ లో శిఖర్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది.

నాకు ప్రపంచ కప్ ఆడాలని ఉంది. కానీ.. నా బొటన వేలి గాయం ఇంకా మానలేదు. అందుకే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. నా గాయం త్వరగా మాని ఉంటే బాగుండేది. కానీ.. అది మానలేదు. నేను ప్రపంచ కప్ ఆడాలని.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీమిండియా ఖచ్చితంగా కప్ గెలుస్తుంది. నేను లేకున్నా టీమిండియా క్రికెట్ బాగా ఆడుతుంది.. జట్టుకు మీ మద్దతు ఎప్పుడూ ఉండాలి.. అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో శిఖర్ ధావన్ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

తన గాయం కారణంగా ధావన్ ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ జరిగనప్పుడు.. కమిన్స్ బౌలింగ్ లో శిఖర్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. దీంతో ఆయన ప్రపంచ కప్ కు దూరం కావాల్సి వచ్చింది. ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమ్ లోకి వచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news