ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. జగన్ అధికారం నుండి దిగిపోయే నాటికి ఏపీ అప్పులు రూ. 10 లక్షల కోట్లు ఉంటాయని అన్నారు. వాటిపై చెల్లింపుల భారమే ఏడాదికి లక్ష కోట్లు అవుతుందని.. ఈ లెక్క జమాలేని అప్పులు ఏపీలో అగ్నికి ఆధ్యమయ్యయని అన్నారు యనమల రామకృష్ణుడు.
ఈ అప్పుల బరితెగింపు పై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుంది? అంటూ ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలు కన్నా సాక్షిలో వాటి ప్రకటనలకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన గుండు సున్నా, యువతలో అశాంతి నెలకొంది అన్నారు. బాధిత వర్గాల ప్రజలే వైసిపికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు యనమల రామకృష్ణుడు.