తొలుత ఇంగ్లండ్, తర్వాత వెస్టిండీస్ టూర్లలో రాణించిన భారత క్రికెట్ జట్టు తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ సత్తా చాటింది. 3 వన్డేల వన్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే… భారత చేజిక్కించుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా సాగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా బ్యాటర్లు కేవలం 25.4 ఓవర్లలోనే చేధించి విజయం సాధించారు.
అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ప్లేయర్ శుభ్ మన్ గిల్ వన్డేలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో 8 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో టీమిండియా ప్లేయర్ గా గిల్ చరిత్ర సృష్టించాడు. హరారే వేదికగా జింబాబ్వే తో జరిగిన రెండో వన్డేల్లో 33 పరుగులు చేసిన గిల్ ఈ ఘనత సాధించారు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శ్రేయాస్ అయ్యర్ 416 పరుగులు, నవజ్యోత్ సింగ్ సిద్దూ 414 పరుగులు చేసి.. తొలి రెండు స్థానాల్లో నిలిచారు.