కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన విషయం తెలిసిందే…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడానికి సినిమా ఒక్కటే కారణం కాదని, రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఫాలోయింగ్ ఉంది… ఆ ఫాలోయింగ్‌ని ఉపయోగించుకోవడం బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఎన్టీఆర్‌కు అభిమానులు ఎక్కువ ఉంటారు.. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీసీల మద్ధతు కావాలి. అలాగే జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ఏపీ ఓటర్ల మద్ధతు కావాలి.
అందుకే తెలివిగా అమిత్ షా..ఎన్టీఆర్‌తో భేటీ అయ్యి తమ బలాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని…ఈ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని, బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారని, పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని కొడాలి మాట్లాడారు.
అయితే ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి మాటల్లో కాస్త లాజిక్ ఉన్నట్లే కనిపిస్తోంది. మామూలుగా దక్షిణాదిలో బీజేపీకి బలం తక్కువ..ఒక కర్నాటక తప్ప..మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రమే బలం. కర్నాటక తర్వాత బీజేపీ కొద్దో గొప్పో పుంజుకుంటుంది తెలంగాణలోనే..అక్కడ అధికారంలోకి రావాలని చూస్తుంది…అలాగే ఏపీలో బలపడాలని చూస్తుంది. ఎన్టీఆర్ లాంటి వారి సపోర్ట్ ఉంటే బీజేపీ బలం ఇంకా పెరుగుతుంది. అందుకే ఇలాంటి సమయంలో షా..ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది…రెండు రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. చూడాలి రానున్న రోజుల్లో బీజేపీ ఇంకా ఎలాంటి స్కెచ్ లతో ముందుకొస్తుందో.