బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తే… బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పరిపాలన వదిలేసి, ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని… కేంద్రం పరిపాలన మర్చిపోయిందని ఆగ్రహించారు.
సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపి అంటుంది. మీరు పార్టీనా.. దర్యాప్తు ఏజెన్సీనా..అని ఆగ్రహించారు. జేబు సంస్థలుగా మరాయా అనే అనుమానం కలుగుతోంది…పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది. రాష్ట్రంలో మత కలహాలు మంచివా…? అని నిలదీశారు. భూమికి బరువైన పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని.. ఇలాంటి సమయంలో… మత విధ్వేశాలను రెచ్చిగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కవిత ఇంటిపై ఎందుకు దాడి చేశారని బీజేపీని ప్రశ్నించారు హరీష్ రావు.