Ind Vs Pak: సెంచరీ చేయాలని కోహ్లికి గంగూలీ హెచ్చరిక !

-

ఇవాళ ఆసియా కప్‌ లో భాగంగా.. దయాదుల పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో కోహ్లీ ఫామ్ లోకి రావాలని ఆకాంక్షించిన దాదా కనీసం తన కోసమైనా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పాడు.

ఈ టోర్నీలో రాణించకుంటే కోహ్లీ కెరీర్ ముగిసే ప్రమాదం ఉందని పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ పెద్ద విషయమే కాదన్న దాదా, ఈ మ్యాచ్ ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత ఆటగాళ్లకు తెలుసని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడిన దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ కేవలం దేశం కోసం మాత్రమే కాదు, తన కోసం తాను పరుగులు చేయాల్సి ఉంది. ఈ సీజన్ కోహ్లీకి గొప్పగా ఉంటుందని ఆశిస్తున్న. తను తిరిగి ఫామ్ లోకి వస్తాడని మాకు నమ్మకం ఉంది. అందరిలాగే మేము కూడా తను శతకం బాదితే చూడాలని కోరుకుంటున్నాం. అందుకు తగ్గట్లుగా కోహ్లీ కష్టపడుతున్నాడు కూడా’ అని దాదా చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news