రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం

-

తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు ఇచ్చే కానుక బతుకమ్మ చీరలు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ఆడపడుచులకు ఈ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు బతుకమ్మ చీరలను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో 1కోటి 18 లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు జగిత్యాల జిల్లాలో నేతన్నలతో బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. ఈసారి 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్‌లతో కలిపి మొత్తం 240 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరల తయారు చేయిస్తున్నారు. గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయిస్తున్నారు. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభంకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది.

Read more RELATED
Recommended to you

Latest news