ఈ నెల 14న లాంచ్‌ కానున్న iQoo Z6 Lite 5G..!

-

ఐకూ నుంచి మరో కొత్త ఫోన్ ఈ నెలలోనే లాంచ్‌ కానుంది. అదే ఐకూ జెడ్‌ 6 లైట్ 5జీ. ఈ నెల 14న ఫోన్‌ విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారింగా ప్రకటించింది. ఇది కూడా బడ్జెట్‌ ఫోనే. అయితే ఇందులో ఒక యూనిక్యూ ఫీచర్‌ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రపంచంలో ఈ ప్రాసెసర్‌తో రానున్న మొదటి ఫోన్ ఇదే. ఇంకా ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

iQoo Z6 Lite 5G వివరాలు..

ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉండనుందని గతంలో ఐకూ తెలిపింది.
ఇందులో 6 ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీని అందించారు.
దీనికి సంబంధించిన మైక్రో సైట్‌ను కూడా కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ అంటుటు బెంచ్ మార్కింగ్ సైట్‌లో 3,88,486 పాయింట్లను సాధించింది.
ఇది మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్‌ను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.15 వేలలోపే ఉండనుంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
దీనికి సంబంధించిన కెమెరా, గేమింగ్ ఫీచర్లు త్వరలో రివీల్ చేయనున్నారు.

ఐకూ ఇటీవలే చైనాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐకూ యూ5ఈ. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,000) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా అంటే సుమారు రూ.18,000గా ఉంది. ఇందులో 6.51 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఆక్టాకోర్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5జీని కూడా సపోర్ట్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news