పెద్దపల్లి నుంచి గద్దర్…ఫిక్స్?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గాయకుడు గద్దర్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజలకు చేరువయ్యారు. తన విప్లవ గీతాలతో జనాల్లో చైతన్యం తెచ్చే గద్దర్..తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఇలా విప్లవ కళాకారుడుగ ఉన్న గద్దర్…ఇంతవరకు రాజకీయాల్లోకి రాలేదు. కాకపోతే ఆయా పార్టీ నేతలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని… ఆ పార్టీకి చెందిన నేతలు గద్దర్‌ని ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజాగాయకుడు గద్దర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆహ్వానించారు. రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రలోనూ పాల్గొనాలని కోరారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి చేయాలని గద్దర్‌ను కోరినట్లు తెలిసింది. ఇక భట్టి ప్రతిపాదన పట్ల గద్దర్‌ సానుకూలంగా స్పందించారని సీఎల్పీ వర్గాలు తెలిపాయి.

అంటే గద్దర్…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో గద్దర్…కాంగ్రెస్ కూటమికి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల గద్దర్…సికింద్రాబాద్‌లో జరిగిన మోదీ సభకు హాజరయ్యారు. అలాగే ఈ మధ్య బండి సంజయ్‌ని కూడా కలిశారు. కానీ గద్దర్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఆహ్వానించింది. మరి ఈ విషయంలో గద్దర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో క్లారిటీ లేదు.

అదే సమయంలో పెద్దపల్లి ఎంపీగా బరిలో దిగితే పరిస్తితులు అంత ఈజీగా ఉండవు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్, బీజేపీలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పై 95 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేత గెలిచారు. అప్పుడు బీజేపీకి 92 వేల ఓట్లు పడ్డాయి. కానీ ఈ సారి వివేక్ బీజేపీ నుంచి బరిలో దిగితే ట్రైయాంగిల్ ఫైట్ ఉంటుంది. మరి చూడాలి గద్దర్…కాంగ్రెస్‌లో చేరి, పెద్దపల్లి నుంచి బరిలో ఉంటారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news