సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పుట్టినరోజు నాడు ఆ స్టార్ హీరో సినిమా రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైస్ ఇస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ బాలకృష్ణ పుట్టిన రోజు నాడు చిరంజీవి సినిమా విడుదల చేసి అందర్నీ మరింత ఆశ్చర్యపోయేలా చేశారు నిర్వహుకులు. ఇంతకు ఆ సినిమా ఏంటి ? ఎలాంటి ఫలితాన్ని అందుకుంది ?అనే విషయానికి వస్తే.. చిరంజీవి పాటలు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్నారు. అలా వచ్చిన సినిమాలలో ఖైదీ నెంబర్ 786 సినిమా కూడా ఒకటి. ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు..
ఈ సినిమా తర్వాత విజయబాపినీడు నిర్మాతగా.. చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెంబర్ 786 సినిమాను బాలయ్య పుట్టినరోజు జూన్ 10వ తేదీన 1988 సంవత్సరంలో థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా విజయోత్సవాన్ని పురస్కరించుకొని విజయ బాపినీడు ఈ సినిమా కార్యక్రమంలో చిరంజీవికి ఏనుగును బహుమతిగా ఇవ్వడం గమనార్హం.. బాలయ్య పుట్టినరోజు నాడు చిరంజీవి సినిమాను విడుదల చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి . ఇకపోతే దేశంలో సినిమా హీరోకు ఈ తరహా కానుక ఇచ్చిన ఏకైక దర్శక నిర్మాత విజయ బాపినీడు కావడం గమనార్హం. ఆ తర్వాత చిరంజీవి ఏనుగును టీటీడీకి కానుకగా ఇవ్వడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమా 100 రోజుల ఈవెంట్ ఉదయం, సాయంత్రం జరగడం గమనార్హం. ఈ సినిమాలోని గువ్వా గోరింకతో సాంగ్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే గాడ్ ఫాదర్ సినిమా మరో నాలుగు వారాలలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు . ఇకపోతే ఈ సినిమా చిరంజీవి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.