కొడాలి-వంశీలని పవన్ ఆపగలరా!

-

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది టీడీపీలో, రాజకీయంగా ఎదిగింది టీడీపీలో…టీడీపీలో పనిచేస్తూనే ప్రజలకు అండగా ఉంటూ…తమకంటూ సొంత ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ ఫాలోయింగ్ ఎలాంటిది అంటే వారు ఏపార్టీలోకి వెళ్ళినా గెలిచేలా. అలా ఫాలోయింగ్ పెంచుకుని ఎక్కడైనా గెలవలగల సత్తా ఉన్న నాయకులు ఎవరో కాదు…టీడీపీని వదిలి వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ.

కొడాలికి టీడీపీలో ఎలాంటి మాస్ ఫాలోయింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే టీడీపీలో రెండుసార్లు గెలిచి…వైసీపీలోకి వచ్చి వరుసగా రెండుసార్లు సత్తా చాటారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడని వైసీపీ కంచుకోటగా మార్చారు. తనతో పాటు టీడీపీ కేడర్‌ని చాలావరకు తనతో తిప్పేసుకున్నారు.  దీంతో గుడివాడలో నానిని ఓడించడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. అక్కడ పరిస్తితి ఎలా ఉందంటే..ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే గుడివాడలో మాత్రం నానిని ఓడించడం జరిగే పని కాదు అన్నట్లు ఉంది. ఇప్పటికీ అక్కడ అదే పరిస్తితి ఉంది.

ఇటు గన్నవరంలో వంశీకి కూడా అలాంటి ఫాలోయింగ్ ఉంది…రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన వంశీ..తనకంటూ మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక గత ఎన్నికల్లో గెలిచాక వంశీ టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. దీంతో గన్నవరంలో వైసీపీ బలం పెరిగింది..టీడీపీ బలం తగ్గింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే గుడివాడ-గన్నవరంల్లో నాని-వంశీ గెలుపుని ఎవరు ఆపలేని పరిస్తితి.

తాజా సర్వేల్లో కూడా అదే రుజువైంది. మరి ఈ ఇద్దరికీ చెక్ పెట్టాలంటే టీడీపీ వల్ల అయ్యేలా లేదు. కానీ టీడీపీతో గాని పవన్ కలిస్తే ఏమైనా సాధ్యమవుతుందా? అంటే అబ్బే అప్పుడు కూడా కష్టమే అని తెలుస్తోంది. గుడివాడలో కాపు ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి..కానీ వారు ఎక్కువగా నానిని అభిమానిస్తారు. గన్నవరంలో పవన్ ప్రభావం పెద్దగా లేదు. అంటే టీడీపీతో పవన్ కలిసిన సరే…నాని-వంశీ విజయాలని ఆపడం కష్టం.

Read more RELATED
Recommended to you

Latest news