ఏపీ రాజధాని, రాష్ట్ర పాలన గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు అమర్ నాథ్. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమర్ నాథ్. ఏపీకి అమరావతితో పాటు విశాఖ, కర్నూలులను రాజధానుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా ఆయన వెల్లడించారు.
వచ్చే ఏడాది నుంచి ఏపీ పాలన విశాఖ నుంచే సాగుతుందని కూడా గుడివాడ చెప్పారు అమర్ నాథ్. ఇక అమరావతి టూ అరసవిల్లి అంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమర్ నాథ్. విశాఖ పరిధిలో రైతుల పాదయాత్రలో ఏం జరిగినా దానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యుడని ఆరోపించారు అమర్ నాథ్. విశాఖలో రాజధాని కోసం సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదని అన్నారు అమర్ నాథ్.