టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

-

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. బీబీ పాటిల్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై పునః పరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం సూచించింది. అక్టోబర్ 10 న హైకోర్టుకు హాజరుకావాలని, ఈ కేసులో అన్ని అంశాలు ఓపెన్ గానే ఉంటాయని తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. కేసులోని అంశాల దృష్ట్యా మళ్లీ పరిశీలించాలని సూచించింది.

తెలంగాణ హైకోర్టు జూన్ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, మూడు నెలలు గడిచిన తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులను ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, కాలపరిమితితో కూడిన సున్నితమైన ఎన్నికల పిటిషన్ల విషయంలో అప్పిలు చేసుకోవడాన్ని నిరోధించడానికి కారణం లేదు అని వ్యాఖ్యానించింది. ఆరు నెలల లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news