“ప్రిన్స్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

-

శివ కార్తికేయన్.. కోలీవుడ్ యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాను నటించిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. డాక్టర్ బాబు, డాన్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ నేరుగా తెలుగులో నటిస్తున్న సినిమా ప్రిన్స్.. ఇక ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అలాగే ఏషియన్ మూవీ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు శివ కార్తికేయన్. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ” ప్రిన్స్”. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయకగా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళంలో గ్రాండ్ జరిగింది. కాగా తెలుగులోనూ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. మంగళవారం (రేపు) జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news