ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్రం అందిస్తోంది. దీని వలన ఆర్ధికంగా సపోర్ట్ ఉంటుంది. అయితే అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు ప్రధాన నరేంద్ర మోడీ గుజరాత్‌లో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఇక పూర్తి వివరాలను చూస్తే.. కేంద్రం అందించే స్కీమ్స్ లో ఆయుష్మాన్ భారత్ యోజన కూడా ఒకటి.పేద వర్గాలకు ప్రభుత్వం ఉచిత చికిత్సను ఈ స్కీమ్ ద్వారా ఇస్తుంటారు. దీని కోసం ఆయుష్మాన్ కార్డును జారీ చేస్తుంది.
ఆయుష్మాన్ పథకం:
కార్డుదారుడు రూ. 5 లక్షల వరకు ఆసుపత్రులలో ఫ్రీ గా చికిత్స తీసుకోవచ్చు. ఇలా ఆసుపత్రిలో ఈ కార్డుని ఉపయోగించుకోవచ్చు.
మీరు ఇలా కార్డుని పొందొచ్చు:
దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా అధికారిక పోర్టల్ కి వెళ్ళండి.
నెక్స్ట్ ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యండి.
తరవాత మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు రాష్ట్రాన్ని ఎంచుకుని, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు అర్హులా కాదా అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు.
ఇలా అర్హత వున్నవాళ్లు ఈ కార్డుని పొంది… కార్డుదారుడు రూ. 5 లక్షల వరకు ఆసుపత్రులలో ఫ్రీ గా చికిత్స తీసుకోవచ్చు.