ఆ మంత్రులు ఫ్లాప్.. కేటీఆర్, హరీష్ హిట్..!

-

మునుగోడు ఉపఎన్నికలో గెలుపుని అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే..ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ చేతులో చావు దెబ్బతిన్నారు. ఇక మునుగోడులో కూడా ఓడిపోతే ఇంకా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిస్క్ అని గులాబీ శ్రేణులు భావించాయి. అందుకే మునుగోడులో ఖచ్చితంగా గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు..ఇలా అందరూ ఒకో గ్రామం బాధ్యత తీసుకున్నారు. ఆఖరికి సీఎం కేసీఆర్ సైతం ఒక గ్రామం బాధ్యత తీసుకున్నారు.

మొత్తానికి అందరూ కలిసికట్టుగా పంచేసి పార్టీ విజయానికి కృషి చేశారు…చివరికి పార్టీ 10 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచింది. అయితే ఇంచార్జ్‌లుగా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు తమ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ తీసుకురావడంలో విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..బాధ్యత తీసుకున్న పలివెల గ్రామంలో బీజేపీకి 331 ఓట్ల మెజారిటీ వచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యత తీసుకున్న నాంపల్లిలో బీజేపీకి 497 ఓట్లు మెజారిటీ. మల్లారెడ్డి ఇంచార్జ్‌గా ఆర్ గూడెం, కాట్రేవు, రెడ్డిబావి గ్రామాల్లో బీజేపీదే మెజారిటీ, శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్ గా ఉన్న లింగోజీగూడెం, తాళ్లసింగారం గ్రామాల్లో..జగదీశ్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న మునుగోడు ఎం‌పి‌టి‌సి-1, ఇంద్రకరణ్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సర్వేల్-1 పరిధిలో బీజీపీదే మెజారిటీ.

ఇక కేసీఆర్ బాధ్యత తీసుకున్న లెంకలపల్లి గ్రామంలో టీఆర్ఎస్‌కు 254 ఓట్ల మెజారిటీ వచ్చింది. హరీష్ రావు ఇంచార్జ్‌గా ఉన్న మర్రిగూడ మండలంలో ఉన్న టీఆర్ఎస్‌కు 516 ఓట్ల మెజారిటీ వచ్చింది. కేటీఆర్ ఇంచార్జ్‌గా ఉన్న గట్టుప్పల్ ఎం‌పి‌టి‌సి-1లో టి‌ఆర్‌ఎస్‌దే మెజారిటీ. నిరంజన్ రెడ్డి, గనుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి ఇంచార్జ్‌లుగా ఉన్న ప్రాంతాల్లో టి‌ఆర్‌ఎస్‌కే లీడ్ వచ్చింది. మొత్తానికి పార్టీ మొత్తాన్ని మోహరించి మునుగోడుని కైవసం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news