ఈ చిన్నారి చేతులు అద్బుతాన్ని చేస్తున్నాయి..ఏకంగా రెండు భాషల్లో..

-

అప్పటి రోజుల్లో పిల్లలకు పెద్దలు దగ్గరుండి నేర్పించేవారు..కానీ ఇప్పుడు పిల్లలే పెద్దలకు నేర్పిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా అద్బుతాలను సృష్టిస్తున్నారు.మన చుట్టూ మల్టీ టాలెంట్ కలిగిన పిల్లలని మనం చాల అరుదుగా చూస్తుంటాం.. ఒకటో తరగతి పిల్లలు మాములుగా ఒక భాషలో చదవటం,రాయడం కష్టం..అదే అంబులెన్స్ పై రాసిన విధంగా మిర్రర్ ఎఫెక్ట్ తో ప్రతి అక్షరాన్ని రాయగలమా అంటే కష్టమే అని చెప్పాలి. ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపు అయితే చిన్నారులు సింపుల్ గా రాసేస్తాం.. అక్షరాలను ముగింపు నుంచి మొదటి వరకు రాయమంటే దిక్కులు చూడక తప్పదు. దీనినే అపసవ్య దిశాలో రాయడం అని కూడా అంటారు. ఇలాంటి అరుదైన ప్రజ్ఞాశాలిగా.. ఎన్నో జాతీయ.. ఆంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంటోంది ఓ ఆరేళ్ళ చిన్నారి..

నెల్లూరు జిల్లా కావాలి పట్టణంలో వస్త్ర వ్యాపారం చేస్తుంటారు శ్రీనివాస రావుకు మొదటి సంతానం పచ్చిపులుసు సువర్ణిక. ఇప్పుడుడిప్పుడే అక్షరాలు దిద్దుకొని పాఠ్యంశాలు అర్థం చేసుకొనే ఆరేళ్ళ వయసు ఈ చిన్నారిది.. కానీ మేధాశక్తి మాత్రం ఆకాశమంత అని చెప్పాలి.

ఏదైనా వింటే ఆ పాఠ్యంశాన్ని ఎప్పుడు అడిగిన వెంటనే చెప్పే ఏకసంతాగ్రహి చిన్నారి సువర్ణిక.. అయితే కరోనా సమయంలో స్కూళ్లకు సెలవు కావడంతో తన బుర్రకు పదునుపెట్ట సాగింది. అందరి చిన్నారులలా కాకుండా.. ప్రత్యేక ప్రతిభ కనపరిచేలా కృషి చేసింది. సవ్యదశ కాకుండా అపసవ్య దిశలో అక్షరాలను. లెక్కలను రాయటం ప్రారంభించింది..

మొదట ఆమె రాసే విధానం తప్పు అని ఉపాధ్యాయులు అన్నా కూడా అలాగే రాసేది..ఇంగ్లీష్, హిందీ, తెలుగు బాషలలో అక్షరాలను అపసవ్య దిశలోనే కాకుండా… అంబులెన్స్ మోడల్లో రాస్తుంది. సాధారణ లిపిని కూడా వెనుక నుంచి వేగంగా లిఖిస్తుంది. 20 ఎక్కాల వరకు వెనుక నుంచి రాస్తూ అసలు శైలి వచ్చేలా వేగంగా చిత్రిస్తుంది. పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలను ఈ చిన్నారి అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది. రీజనింగ్లోనూ సత్తా చాటుతుంది. ఆంగ్ల అక్షరమాలలో ఏ అంటే 1, జెడ్ అంటే 26 చివరిది. ఈమధ్యలో ఉండే అక్షరావళిలో దేనికైనా సంఖ్య టక్కున చెబుతుంది..

ఇకపోతే మూడు భాషల్లో ప్రతిభ కలిగిన సువర్ణికకు మూడు సార్లు జాతీయ, మరో రెండు సార్లు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు నిర్వహించిన పోటీల్లో నిమిషంలో ఎనిమిది గుణింతాలు చెప్పింది. అపసవ్య దిశలో పదాలు రాసి గతంలోనే ఈపుస్తకంలో పేరు నమోదు చేసుకుంది. ఇండియా బుక్ రికార్డ్సు, ఇండియా స్టార్ బుక్ రికార్సులో తన పేరు లిఖించుకుంది. రోమన్ సంఖ్యలతో పది వరకు గుణింతాలను అపసవ్యంగా 50 సెకన్ల వ్యవధిలో రాస్తుండడంతో జాతీయ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది..నిజంగా ఇలాంటి పిల్లలను అభినందించాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news