హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

-

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ జిల్లాలోని హెల్త్ సొసైటీ కింద బస్తీ దవాఖనాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 31 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ చైర్మన్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో నవంబర్ 11 2022 లోపు పోస్ట్ ద్వారా కింది చిరునామాకు దరఖాస్తులు పంపించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news