తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 12న అంటే ఎల్లుండి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక చర్చ తెరపైకి వచ్చింది.

తెలంగాణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి హోదాలో కేసీఆర్ వెళ్తారా అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించాలని కేంద్రమంత్రి మన్ సుక్ మాండవియా కెసిఆర్ కు లేఖ రాశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు సీఎం కేసీఆర్.. ఆ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.