సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందలేదని..మోడీ పర్యటపై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. భారత్ బయోటెక్ వచ్చినప్పుడు క్రెడిట్ కోసం ప్రధాని ఒక్కరే వెళ్లారని..పీఎంవో నుంచి సీఎంఓ కు గెస్ట్ ఆప్ ఆనర్ గా పిలవడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. కానీ పిఎంవో నుంచి ఆహ్వానం లేదు.. ఎరువుల శాఖ మంత్రి పేరుతో కేవలం పాల్గొనాలి అని మరోసారి అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇది తెలంగాణ సమాజం నాలుగు కోట్ల జనాల్ని అవమానించడమేనని.. తెలంగాణ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేయమన్న దానిపై మోడీ స్పందించాలి… కార్మికులకు పెన్షన్ పెంచుతామన్నారు.. ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 11వ వేతన ఒప్పందం అమలు చేస్తామని ప్రకటించాలి.. సిసిఐని ఆదిలాబాద్ జిల్లాలో పునర్ ప్రారంభం చేస్తామని చెప్పాలి..14 నెల్ల కిందట ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారం ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ప్రధాని డ్రామా అని నిప్పులు చెరిగారు. తెలంగాణకు 10 మెడికల్ కాలేజీలు ఇస్తామని ప్రకటించాలని వెల్లడించారు బాల్క సుమన్.