భాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు షురూ

-

క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. అయితే.. క్రైస్తవులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ క్రిస్మస్‌కు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో.. క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. లక్డికపుల్ లోని అశోక హోటల్ లో కేక్ మిక్సింగ్ తో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించారు. సినీ నటి రాజుగారి గది ఫేమ్ స్నేహ గుప్త ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Christmas cake - Wikipedia

వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో పాటు విదేశాలకు చెందిన ఖరీదైన వైన్ తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. ఈ కేక్ మిక్సింగ్‌ను డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టి సోక్ చేసి చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ చెఫ్ రామచందర్ తెలియజేశారు. చిన్ననాటి నుండి క్రిస్మస్ వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా సెలెబ్రెట్ చేసుకొనే వాళ్ళమని.. ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నటి స్నేహ గుప్త అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news